'ఆ అనుభవాలు నన్ను ఇప్పటికీ వేధిస్తున్నాయి': స్టీవ్ స్మిత్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: World

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ 2018 నాటి బాల్ ట్యాంపరింగ్ ఉదంతం తన జీవితంలో అత్యంత భయంకరమైన అనుభవమని పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలో త్వరలో జరగనున్న పర్యటన నేపథ్యంలో నాటి చేదు జ్ఞాపకాలు ఇప్పటికీ తనను వేధిస్తున్నాయని, కెమెరాల ఫ్లాష్ లైట్లు చూస్తే ఆనాటి ఘటనలు గుర్తుకొస్తాయని ఆయన వెల్లడించారు. ఆ సమయంలో తన మానసిక పరిస్థితి ఎంతో దిగజారిపోయిందని, అయితే ఆ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతున్నానని స్పష్టం చేశారు.