నీట్ యూజీ కౌన్సెలింగ్ గడువు పొడిగింపు: కేఈఏ కీలక ప్రకటన
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: కర్ణాటక
కర్ణాటకలో నీట్ యూజీ 2026 మొదటి విడత మెడికల్, డెంటల్ సీట్ల కేటాయింపు గడువును కేఈఏ పొడిగించింది. అభ్యర్థులు సెప్టెంబర్ 4 మధ్యాహ్నం 2 గంటలలోపు ఆప్షన్లు ఎంచుకోవాలి. ఫీజు చెల్లింపునకు సాయంత్రం 4 గంటల వరకు అవకాశం ఉంది. గడువులోగా స్పందించని వారిని తదుపరి కౌన్సెలింగ్ ప్రక్రియ నుంచి తొలగిస్తామని కేఈఏ హెచ్చరించింది. సీటు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 5 సాయంత్రం 6 గంటలలోపు సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేయాలి.