స్థానిక ఎన్నికల్లో వంద శాతం విజయమే లక్ష్యంగా కూటమి నేతల టెలికాన్ఫరెన్స్
రిపోర్టర్: హరి
స్థలం: అమరావతి
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వంద శాతం విజయం సాధించడమే లక్ష్యంగా మూడు పార్టీల నేతలు సమన్వయంతో పని చేయాలని ఎన్డీఏ ముఖ్యనేతలు పిలుపునిచ్చారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా కూటమి పార్టీల నేతలతో జరిగిన టెలికాన్ఫరెన్స్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ నేత పీవీఎన్ మాధవ్ మాట్లాడారు. విభేదాలకు తావులేకుండా ఐక్యంగా ముందుకు సాగి ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేయాలని నేతలు స్పష్టం చేశారు.