కందకాల్లో పడి ఎవరైనా చనిపోతే అటవీశాఖదే బాధ్యత: చుంచు రాజ్ కిరణ్
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మురిమడుగు గ్రామంలోని దళితుల ఇళ్ల పక్కనే అటవీశాఖ అధికారులు ప్రమాదకరంగా కందకాలు తవ్వడం సరికాదని జనసేన నాయకుడు చుంచు రాజ్ కిరణ్ అన్నారు. ఈ కందకాల్లో పడి ఎవరైనా ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే అందుకు అధికారులే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అటవీశాఖ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేష్, రాజ్ వెంకట్, రాజేందర్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.