పాలమూరులో నలభై శాతం పంట నష్టానికి ప్రభుత్వమే బాధ్యతంటూ కేటీఆర్ ధ్వజం

రిపోర్టర్: గోపి స్థలం: నాగర్‌కర్నూల్

సాగునీరు ఉన్నప్పటికీ పంటలకు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నాగర్కర్నూల్ జిల్లాలో ఎండిపోయిన పంటలను పరిశీలించిన ఆయన, ఉమ్మడి పాలమూరులో నలభై శాతానికి పైగా పంట నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల్లో నీళ్లున్నా ఏపీకి తరలిస్తూ రైతులకు కన్నీళ్లు మిగులుస్తున్నారని విమర్శించారు. ఎల్నినో హెచ్చరికలను పెడచెవిన పెట్టిన కాంగ్రెస్ సర్కార్, ప్రత్యేక సర్వే నిర్వహించి నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని డిమాండ్ చేశారు.