కోనసీమ అభివృద్ధిపై కీలక చర్చలు: రిలయన్స్ ప్రాజెక్టులపై అమలాపురం ఎంపీ హరీష్ సమీక్ష
రిపోర్టర్: వెంకట్
స్థలం: కోనసీమ
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని గాడిమెుగ ప్రాంతంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో చేపట్టే ఎనర్జీ, రిఫైనింగ్, ఆయిల్ మరియు గ్యాస్ రంగాల ప్రాజెక్టులపై పి.ఎం.ఎస్. ప్రసాద్‌తో విస్తృతంగా చర్చించినట్లు అమలాపురం ఎంపీ, టీడీపీ విప్ గంటి హరీష్ మాధుర్ (బాలయోగి) వెల్లడించారు. కోనసీమకు మరిన్ని పెట్టుబడులు తెచ్చి, యువతకు ఉపాధి కల్పించి, పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేసే దీర్ఘకాలిక ప్రణాళికల అమలుపై చర్చలు జరిపినట్లు ఆయన పేర్కొన్నారు.