నిరుద్యోగులకు గుడ్ న్యూస్: నేటి నుంచి హైదరాబాద్ లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

తెలంగాణలో సైన్యంలో చేరాలనుకునే యువతకు రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 13 నుంచి 24వ తేదీ వరకు హైదరాబాద్ లోని గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియం వేదికగా ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అగ్నివీర్ పోస్టుల భర్తీకి జరిగే ఈ ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని, దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. అభ్యర్థులు అన్ని ధ్రువపత్రాలతో హాజరుకావాలని కోరారు.