రేవంత్ రెడ్డి పాలనపై భారాస తీవ్ర విమర్శలు: కేసీఆర్ కుటుంబంపై అబద్ధాలంటూ ఆగ్రహం
రిపోర్టర్: గోపి
స్థలం: Telangana
కేసీఆర్ గారి కుటుంబంపై అబద్ధాలు మాట్లాడే కాంగ్రెసోళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ర్యాంకులు ఇస్తున్నారని Bharat Rashtra Samithi (BRS) తీవ్రస్థాయిలో మండిపడింది. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం ఉందని రేవంత్ అంటుంటే, మరోపక్క లేదని చామల కిరణ్ రెడ్డి అంటున్నారని ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ నాయకుల పరస్పర విరుద్ధ ప్రకటనలపై వస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ, చామల కిరణ్ కుమార్ రెడ్డికి మెదడు మోకాళ్లలో ఉందని ఘాటు వ్యాఖ్యలు చేసింది.