ఎక్స్ యూజర్లకు భారీ ఊరట: లైక్ బటన్తోనే డబ్బులు పంపే కొత్త ఫీచర్
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో కంటెంట్ క్రియేటర్లకు సులభంగా డబ్బులు పంపేలా కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నట్లు టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఎక్స్ మనీ సేవల్లో భాగంగా లైక్ బటన్‌ను కొద్దిసేపు లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా పోస్టు చేసిన వారికి నేరుగా ఒక డాలర్ పంపే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీని ద్వారా వినియోగదారులు ప్రత్యేక పేమెంట్ యాప్‌లను ఉపయోగించాల్సిన అవసరం లేకుండా నేరుగా క్రియేటర్లకు ఆర్థికంగా మద్దతు అందించే అవకాశం లభిస్తుందని అధికారులు తెలిపారు.