ఖమ్మంలో కత్తులతో విన్యాసాలు.. ముగ్గురిపై కేసులు నమోదు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం నగరంలో పుట్టినరోజు వేడుకల పేరుతో తల్వార్లు, కత్తులతో విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేసిన ముగ్గురిపై 2-టౌన్ పోలీసులు కేసులు నమోదు చేశారు. నిందితులు షేక్ ఖాదర్, సయ్యద్ సమీర్, షేక్ సమీర్లను పోలీసులు గుర్తించారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఆయుధాలతో ప్రదర్శనలు చేయడం చట్టరీత్యా నేరమని ఎస్సై రమేష్ హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవని, యువత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు.