విద్యార్థులకు అలర్ట్: క్లాట్ 2027 దరఖాస్తుల సవరణకు అవకాశం

రిపోర్టర్: విజయ్ స్థలం: తెలంగాణ

కామన్ లా అడ్మిషన్ టెస్ట్ 2027 దరఖాస్తుల సవరణ గడువును నేషనల్ లా యూనివర్సిటీల కన్సార్టియం ప్రారంభించిందని అధికారులు తెలిపారు. నవంబర్ పదవ తేదీ వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులలోని తప్పులను సరిదిద్దుకోవచ్చని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల ఎంపికతో పాటు వ్యక్తిగత వివరాలను మార్చుకునే అవకాశం కల్పించారు. డిసెంబర్ ఆరవ తేదీన ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు.