వీబీ గ్రామ్ జీ పథకం అమలుపై మంత్రి సీతక్క సమీక్ష

రిపోర్టర్: T.RAJASHEKAR స్థలం: నర్సంపేట

రాష్ట్రంలో వీబీ గ్రామ్ జీ పథకం అమలు తీరుపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని ఆమె సూచించారు. అధికారుల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని మంత్రి సీతక్క హెచ్చరించారు.