ఈ నెలాఖరులోగా ప్రభుత్వ విద్యార్థులకు రెండో జత యూనిఫాంలు

రిపోర్టర్: విజయ్ స్థలం: తెలంగాణ

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు మరియు రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ఇప్పటికే ఒక జత యూనిఫాంను అందించిన విద్యాశాఖ, రెండో జతను ఈ నెలాఖరులోగా పూర్తిస్థాయిలో పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ఈ దుస్తులను కుట్టించి విద్యార్థులకు అందజేస్తున్నారు.