పెండింగ్ లో ఉన్న నంది అవార్డుల ప్రదానానికి ఏపీ ప్రభుత్వం ముందడుగు
రిపోర్టర్: విజయ్
స్థలం: అమరావతి
సినీ, టీవీ కళా రంగాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన నంది అవార్డుల ప్రదానానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. 2012 నుంచి 2024 వరకూ పెండింగ్ లో ఉన్న 12 ఏళ్ల నంది అవార్డులతో పాటు 2025 అవార్డులను కూడా కలిపి నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 2026లో విజయవాడలో ఫిల్మ్ అవార్డులు, తిరుపతిలో టీవీ అవార్డుల వేడుకలు నిర్వహించనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.