మంత్రి తుమ్మల లాంటి నాయకుడే అందరికీ కావాలి: ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి

రిపోర్టర్: వెంకట్ స్థలం: తెలంగాణ

నాయకుడంటే మంత్రి తుమ్మల నాగేశ్వరరావులా ఉండాలని బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ప్రశంసించారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన, తాను చెప్పిన రైతు సమస్యపై ఆదివారమైనా స్పందించి వెంటనే పరిష్కరించేలా కలెక్టర్‌తో మాట్లాడారని కొనియాడారు. పార్టీలు మారుతుంటాయి, పదవులు వస్తుంటాయి పోతుంటాయి కానీ, మంత్రులందరూ తుమ్మల పనితీరును ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.