వైద్య సంచలనం: రోబోటిక్ సర్జరీతో యువతికి ప్రాణాపాయం తప్పించిన డాక్టర్లు
రిపోర్టర్: రాజేష్
స్థలం: బెంగళూరు
బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో ఇరవై నాలుగు ఏళ్ల యువతికి వైద్యులు రోబోటిక్ సర్జరీ విజయవంతంగా నిర్వహించినట్లు యూరాలజీ నిపుణులు డాక్టర్ సూర్యకాంత్ చౌబే తెలిపారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రితిక అనే ఇంజనీరింగ్ విద్యార్థినికి ఎడమ కిడ్నీలో కణితి ఏర్పడగా వైద్యులు దానిని తొలగించారు. కిడ్నీ దెబ్బతినకుండా రోబోటిక్ టెక్నాలజీతో ట్యూమర్‌ను పూర్తిగా తొలగించి ఆమె ప్రాణాలను రక్షించినట్లు వైద్యులు వెల్లడించారు.