మిగులు టీచర్ల సర్దుబాటుపై విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ హెచ్చరిక
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
మిగులు టీచర్ల సర్దుబాటులో భాగంగా ఇతర పాఠశాలలకు కేటాయించిన ఉపాధ్యాయులు విధుల్లో చేరకపోతే సీసీఏ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ హెచ్చరించారు. కొత్త స్థానాల్లో రిపోర్ట్ చేయని ఉపాధ్యాయుల వివరాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని డీఈవోలను ఆయన ఆదేశించారు.