టెక్ రంగంలో కలకలం రేపుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణుల రాజీనామాలు
రిపోర్టర్: హరి
స్థలం: లండన్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కోట్లు కుమ్మరించే కొలువులను సైతం వదిలేసి నిపుణులు బయటకు వస్తున్నారు. భవిష్యత్తులో టెక్నాలజీ వల్ల మానవాళికి రాబోయే ముప్పును ఊహించి వారు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది. నియంత్రణ కోల్పోతామనే భయంతో ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు.