బెల్లంపల్లిలో బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్.. నిరసన ఉద్రిక్తత
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: మంచిర్యాల
శాసనసభలో బీఆర్ఎస్ శాసనసభ్యులపై జరిగిన దాడిని నిరసిస్తూ బెల్లంపల్లి పట్టణంలో బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ నాయకులు రహదారి దిగ్బంధం చేపట్టారు. ఈ నిరసనను అడ్డుకున్న పోలీసులు పలువురు నాయకులను అరెస్ట్ చేసి మాదారం పోలీస్ స్టేషన్కు తరలించారు.
ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును అణచివేయడం సరికాదని నాయకులు మండిపడ్డారు. అరెస్టులతో తమ పోరాటాన్ని ఆపలేరని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్, మాజీ ఉపాధ్యక్షుడు బత్తుల సుదర్శన్ స్పష్టం చేశారు.