శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఘనంగా అన్నదానం
రిపోర్టర్: KISHORE M
స్థలం: ఆదోని
కపటి-నాగలాపురం గ్రామంలోని శ్రీకృష్ణ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలలో బీజేపీ నాయకుడు రాఘవేంద్ర పాల్గొని స్వామివారికి పూజలు చేశారు.
అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు సేవ చేయడం ఆనందంగా ఉందని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని రాఘవేంద్ర ఆకాంక్షించారు.