కీసర ఓఈఆర్ పై అదుపుతప్పి పల్టీ కొట్టిన ఆటో
రిపోర్టర్: సురేష్
స్థలం: కీసర
కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వలస కూలీలు దుర్మరణం చెందగా, మరో పదకొండు మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. కూలీలతో వెళ్తున్న అశోక్ లేలాండ్ ఆటో వెనుక టైర్ హఠాత్తుగా పేలిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కీసర నుంచి షామీర్ పేట్ వైపు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని, మృతులు మహారాష్ట్రకు చెందిన వలస కూలీలుగా గుర్తించామని అధికారులు వెల్లడించారు.