"తిరుమలలో ఉచిత ఈవీ బస్సులు": సీఎం చంద్రబాబు ప్రారంభం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: తిరుమల
తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రవాణా కోసం ఉచిత ఎలక్ట్రిక్ బస్సుల సేవలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అధికారికంగా ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రిలయన్స్ సంస్థ విరాళంగా అందించిన 25 ఈవీ బస్సులతో పాటు మరో సంస్థ అందించిన 7 బస్సులను టీటీడీకి అంకితం చేశారు. జియో-బీపీ సహకారంతో ఛార్జింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేయగా, బ్రహ్మోత్సవాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఈ ఉచిత బస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.