గుడిరేవు కాకోబాయి జాతరకు పోటెత్తిన ఆదివాసీ భక్తజనం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: దండేపల్లి

దండేపల్లి మండలంలోని గుడిరేవు గోదావరి తీరంలో జరుగుతున్న పద్మల్ పూరి కాకోబాయి జాతరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఆదివాసులు భారీగా తరలివచ్చారు. దీపావళిని పురస్కరించుకుని ఆలయంలో గుస్సాడీ, దండారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం భక్తులు కాకోబాయిని దర్శించుకుని ప్రత్యేక పూజలు ఆచరించడంతో జాతర ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.