ఫుడ్ కమిషన్ చైర్మన్ ను కలిసిన రజక సంఘం కార్యదర్శి
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్
ఆమనగల్ మున్సిపాలిటీ రజక సంఘం ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన నాగిళ్ల తిరుపతయ్య తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తిరుపతయ్యను చైర్మన్ అభినందించారు. సంఘం అభివృద్ధికి, రజక వృత్తిదారుల సంక్షేమానికి పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.