ఉద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ KKC కీలక చర్చ
రిపోర్టర్: sankar p
స్థలం: విజయవాడ
విజయవాడలోని ఆంధ్ర రత్న భవన్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆర్గనైజింగ్ వర్కర్ అండ్ ఎంప్లాయిస్ కాంగ్రెస్ (KKC) సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో KKC జాతీయ అధ్యక్షుడు డాక్టర్ విద్యుత్ ఉదిత్ రాజును తిరుపతి జిల్లా KKC వైస్ చైర్మన్ పాలెపు కృపానంద్ మర్యాదపూర్వకంగా కలిశారు.
పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. వారి సంక్షేమం, హక్కుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.