రైతన్నలకు తీపి కబురు: రైతుబజార్లలో కిలో ముప్పై ఐదు రూపాయలకే సబ్సిడీ ఉల్లి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: గుంటూరు
పెరుగుతున్న ఉల్లి ధరలతో సామాన్యులపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు బజార్లలో కిలో ముప్పై ఐదు రూపాయల చొప్పున సబ్సిడీ ఉల్లిని పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆధార్ కార్డు ప్రాతిపదికన ప్రతి కుటుంబానికి రెండు కిలోల చొప్పున రాయితీ ఉల్లిని అందిస్తుండటంతో కొనుగోలు చేయడానికి ప్రజలు భారీగా బారులు తీరుతున్నారు. బహిరంగ మార్కెట్లో ధరలు చుక్కలు తాకుతుండటంతో వినియోగదారులకు ఈ నిర్ణయం ఎంతో ఊరటనిస్తోంది.