బుమ్రాను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశాం: ఇబ్రహీం జద్రాన్

రిపోర్టర్: కిరణ్ స్థలం: New Delhi

భారత్‌తో జరిగే టీ20 సిరీస్ కోసం స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ తెలిపారు. దిల్లీ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో బుమ్రాతో పాటు యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని కట్టడి చేసేందుకు ఐపీఎల్ అనుభవాలను ఉపయోగించుకుంటామని పేర్కొన్నారు. భారత్ పరిస్థితులు తమకు బాగా తెలుసని ధీమా వ్యక్తం చేశారు.