మురసు తుపాను ముప్పు: విద్యుత్ శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి గొట్టిపాటి
రిపోర్టర్: వెంకట్
స్థలం: Amaravati
మురసు తుపాను వేళ ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల సీఎండీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, క్షేత్రస్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. టోల్ ఫ్రీ నంబర్ 1912ను అందుబాటులో ఉంచాలని, జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు.