స్థానిక ఎన్నికల వేడి: విజయనగరం జిల్లాలో శరవేగంగా ఏర్పాట్లు చేపట్టిన యంత్రాంగం

రిపోర్టర్: సునీల్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు వడివడిగా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా యంత్రాగం వెల్లడించింది. కోర్టు తీర్పుతో స్పష్టత రావడంతో అధికారులు వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. రాజాం మున్సిపాల్టీలో వార్డుల సంఖ్య పెరగగా, బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామగ్రిని సిద్ధం చేస్తున్నారు. సిబ్బందికి శిక్షణతో పాటు ఎన్నికల ముడిసరకు జిల్లాకు చేరిందని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.