చిరు వ్యాపారులకు పీఎం స్వనిధి క్రెడిట్ కార్డులు జారీ

రిపోర్టర్: రాము స్థలం: Andhra Pradesh

రోడ్లపై తోపుడు బండ్లు, చిన్న దుకాణాలతో వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం పీఎం స్వనిధి పథకం ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తోంది. లబ్ధిదారులకు వ్యాపార పెట్టుబడుల కోసం రూ.10,000 నుంచి రూ.30,000 వరకు క్రెడిట్ కార్డులు జారీ చేస్తూ వెసులుబాటు కల్పిస్తున్నట్లు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. లోక కళ్యాణ మేళా పేరుతో చిరు వ్యాపారులకు ఈ రుణాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.