జాతీయ స్థాయి సైకిల్ పోలో పోటీలకు ఉలవపాడు యువకులు

రిపోర్టర్: అశోక్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లా కావలి సరిహద్దులోని ఉలవపాడు గ్రామానికి చెందిన యువ వ్యాయామ ఉపాధ్యాయులు ఖాదర్ బాషా, నెల్లూరు వెంకట్రావు సైకిల్ పోలో క్రీడలో సత్తా చాటుతున్నారు. ఇటీవల మద్దూరుపాడులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చాటిన వీరు, రాజస్థాన్‌లో నవంబరు 14 నుంచి జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి కష్టపడి పైకొచ్చిన ఈ యువకులు పలుమార్లు రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నారు.