బ్యాంకు ఖాతా నుంచి ఇరవై ఎనిమిది వేల డాలర్లు మాయం: బాధితురాలు ఆవేదన

రిపోర్టర్: హరి స్థలం: మసాచుసెట్స్

అమెరికా లోని మసాచుసెట్స్ రాష్ట్రానికి చెందిన మాడిసన్ వైజ్ అనే మహిళ బ్యాంకు ఖాతా నుంచి నేషనల్ గ్రిడ్ సంస్థ ముప్ఫై వేల డాలర్లకు పైగా నగదును బలవంతంగా మళ్లించిందని మీడియా తెలిపింది. తప్పుగా వచ్చిన గ్యాస్ బిల్లును సరిదిద్దుతామని చెప్పిన కంపెనీ వర్గాలు, ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఖాతాలో ఉన్న డబ్బును పూర్తిగా డెబిట్ చేశాయని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మూడు రోజులు మాత్రమే ఖాతా కలిగి ఉన్నప్పటికీ భారీ బిల్లు వేయడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.