మరణించిన పంచాయతీ కార్మికుడి కుటుంబానికి సీఐటీయూ ఆర్థిక సహాయం
రిపోర్టర్: KOLA MAHESH
స్థలం: నారాయణపురం
రామన్నపేట మండలంలో మరణించిన పంచాయతీ కార్మికుడు గొర్ల నాగరాజు కుటుంబానికి సీఐటీయూ మండల కమిటీ 9 వేల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు 25 కిలోల బియ్యాన్ని అందజేసింది. నాగరాజు మరణం పట్ల ఆవేదన వ్యక్తం చేసిన యూనియన్ నాయకులు, ఆయన కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సాయం అందించాలని, భార్యకు ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనాలు, ఇన్సూరెన్స్ సౌకర్యాలు లేకపోవడంపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.