తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్లను భారీగా పెంచిన మోదీ ప్రభుత్వం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: తెలంగాణ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో వైద్య విద్య రంగం మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా నేషనల్ మెడికల్ కమిషన్ తెలంగాణలో కొత్తగా 1010 ఎంబీబీఎస్ సీట్లను పెంచింది. దీంతో రాష్ట్రంలో మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 10450కి చేరింది. ఇందులో 36 ప్రభుత్వ కాలేజీల్లో 4400 సీట్లు, 30 ప్రైవేట్ కాలేజీల్లో 6050 సీట్లు అందుబాటులో ఉన్నాయని అధికారిక వివరాలు స్పష్టం చేస్తున్నాయి.