స్థానిక పోరులో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలన్న సోమిరెడ్డి
రిపోర్టర్: sujith reddy
స్థలం: తోటపల్లిగూడూరు
నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం కోడూరు పంచాయతీ ముత్యాలతోపులో ఎన్నికల ప్రచారాన్ని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. సీఎం చంద్రబాబు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.