పీవీటీజీల సమస్యలపై ఈ నెల 27న అత్యవసరంగా సదస్సు
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: అల్లూరి సీతారామరాజు
అల్లూరి జిల్లాలో పీవీటీజీల సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 27వ తేదీన అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్లు మర్రి కామయ్య ఆదిమ జాతుల సేవా సంఘం తెలిపింది. మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, కువి ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరుకావాలని కోరారు. సమావేశం జరిగే నిర్దిష్ట ప్రాంతాన్ని త్వరలోనే ప్రకటిస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు.