పేద కుటుంబాలకు శాశ్వత ఇళ్ల స్థలాల హక్కు పత్రాల అందజేత
రిపోర్టర్: నరేష్
స్థలం: బాపట్ల
పేద కుటుంబాలకు శాశ్వత ఆస్తి హక్కు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఆనగాని సత్య ప్రసాద్ - రెవెన్యూ శాఖ మంత్రి, రేపల్లె ఎమ్మెల్యే వెల్లడించారు. సెప్టెంబర్ 30వ తేదీన విజయవాడ వేదికగా పేదలకు పట్టాభిషేకం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో 616.56 ఎకరాల్లోని ఇంటి స్థలాలకు పూర్తి చట్టబద్ధత కల్పిస్తూ సుమారు రూ. 23,000 కోట్ల అంచనా మార్కెట్ విలువ కలిగిన ఆస్తులను లబ్ధిదారులకు అందిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 24,057 కుటుంబాలకు శాశ్వత ఇళ్ల స్థలాల హక్కు పత్రాలు అందజేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ చొరవ ద్వారా నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భద్రత చేకూరుతుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది.