దేశంలోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ గుర్తింపు: నివేదిక వెల్లడి
రిపోర్టర్: రాము
స్థలం: హిమాచల్ ప్రదేశ్
భారతీయ హ్యాపీనెస్ ఇండెక్స్ నివేదిక ప్రకారం హిమాచల్ ప్రదేశ్ దేశంలోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా నిలిచిందని నిపుణులు తెలిపారు. హ్యాపీప్లస్ కన్సల్టింగ్ సంస్థ రూపొందించిన ఈ నివేదికలో జీవన సంతృప్తి, భావోద్వేగ స్వేచ్ఛ, మద్దతు వ్యవస్థలు వంటి పలు కీలక అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు స్పష్టమైంది. ఈ జాబితాలో మిజోరాం, అండమాన్ నికోబార్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలు కూడా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.