అరకు కాఫీ గర్వకారణం: గిరిజన రైతుల శ్రమను కొనియాడిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: అల్లూరి సీతారామరాజు జిల్లా

అరకు కాఫీ మన ప్రాంతానికి సంబంధించిన మధురమైన జ్ఞాపకమని, గిరిజన వర్గాల కఠోర శ్రమకు నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభివర్ణించారు. అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా రాష్ట్రానికి గర్వకారణమైన అరకు కాఫీ విశిష్టతను ఆయన కొనియాడారు. గిరిజన రైతుల కఠోర శ్రమను గుర్తిస్తూ సామాజిక మాధ్యమం వేదికగా స్పందించారు. అరకు కాఫీని ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.