పుత్తూరులో వైభవంగా ముగిసిన వినాయక చవితి వేడుకలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పుత్తూరు

తిరుపతి జిల్లా పుత్తూరు మున్సిపాలిటీ జండామాను వీధిలో వినాయక చవితి వేడుకలు అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పోతుగుంట విజయ్ బాబు పాల్గొన్నారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.