ఫ్లైదుబాయ్ విమానంలో కో పైలట్ దాడితో తీవ్ర కలకలం

రిపోర్టర్: అశోక్ స్థలం: Dubai

దుబాయ్ నుండి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో కో పైలట్ దాడికి పాల్పడ్డాడని అధికారులు తెలిపారు. ప్రయాణ సమయంలో కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ పై సహ పైలట్ కత్తితో దాడి చేయడంతో విమానం ఒక్కసారిగా నాల్గు వేల అడుగులకు పైగా కిందికి పడిపోయింది. తీవ్రంగా గాయపడినప్పటికీ కెప్టెన్ మచ్ఛర్ ఎదురుతిరిగి ప్రయాణికుల సహాయంతో నిందితుడిని అణచివేశారు. అనూహ్య పరిణామాల మధ్య విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయానికి సురక్షితంగా మళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేశారు.