చిన్నారెడ్డిపాలెం అంగన్వాడి కేంద్రంలో ఘనంగా పోషకాహార అవగాహన ఉత్సవాలు

రిపోర్టర్: Venkey ...Nlr స్థలం: పొదలకూరు

వెంకటాచలం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని చిన్నారెడ్డిపాలెం అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సూపర్వైజర్ డి. పద్మజ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లులకు పోషకాహార ప్రాముఖ్యతను వివరించారు. ఆరోగ్య నియమాలపై అవగాహన కల్పించారు.