శ్రీకాకుళంలో ఘోర బస్సు అగ్నిప్రమాదం తప్పిన ప్రాణనష్టం
రిపోర్టర్: విజయ్
స్థలం: శ్రీకాకుళం
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలో జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రమాదవశాత్తు భారీ మంటలు చెలరేగాయి. జమ్మూ జంక్షన్ వద్ద టైరు పేలడంతో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. క్షణాల్లో మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే డ్రైవర్, ప్రయాణికులు అప్రమత్తమై వెంటనే కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పి ప్రాణనష్టం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.