లక్సెట్టిపేట విద్యుత్ శాఖ ఏడీఈగా తిరుపతి బాధ్యతల స్వీకరణ

రిపోర్టర్: Alfa News Desk స్థలం: లక్సెట్టిపేట

లక్సెట్టిపేట విద్యుత్ శాఖ నూతన ఏడీఈగా తిరుపతి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఏడీఈగా పనిచేసిన ప్రభాకర్ పదోన్నతిపై బెల్లంపల్లి డివిజన్కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో హనుమకొండ నుంచి తిరుపతి ఇక్కడ బాధ్యతలు చేపట్టారు.

నూతన ఏడీఈ తిరుపతి లక్సెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాలకు సేవలందించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆయా మండలాల్లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని వెల్లడించారు.