మంత్రాలయం హెచ్చరిక: అభ్యర్థులను బెదిరిస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసుల స్పష్టీకరణ
రిపోర్టర్: గోపి
స్థలం: మంత్రాలయం
బెదిరింపులకు భయపడి నామినేషన్లు వేయడానికి వెనకడుగు వేసే అభ్యర్థులు నేరుగా తమను సంప్రదించాలని మంత్రాలయం సీఐ గిరిబాబు స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రజాస్వామ్యయుతంగా జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరికీ పోటీ చేసే హక్కు ఉందని వెల్లడించారు. నామినేషన్లకు ముందుకు వచ్చే అభ్యర్థులకు పోలీసు శాఖ తరఫున పటిష్టమైన రక్షణ కల్పిస్తామని, భయభ్రాంతులకు గురిచేసే వారిపై చట్టపరంగా అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.