రెండు డాలర్లకు కొన్న పత్రం వేల డాలర్లకు విక్రయం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Nashville
అమెరికా స్వాతంత్ర్య ప్రకటనకు సంబంధించిన అరుదైన పత్రాన్ని రెండు డాలర్ల నరరకు కొనుగోలు చేసిన వ్యక్తి దానిని లక్షల డాలర్లకు విక్రయించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. నాష్విల్లేలోని ఓ దుకాణంలో మైఖేల్ స్పార్క్స్ అనే సంగీత పరికరాల టెక్నీషియన్ ఈ పత్రాన్ని దక్కించుకున్నారు. ఇది 1823 నాటి అరుదైన అధికారిక కాపీ అని పరిశోధనలో తేలిందని ఆయన తెలిపారు. నార్త్ కరోలిన జరిగిన వేలంలో ఈ పత్రం నాలుగు లక్షల డాలర్లకు పైగా అమ్ముడైంది.