అక్టోబర్ 20 నుంచి భారత్ న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: న్యూఢిల్లీ
భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వచ్చే అక్టోబర్ 20వ తేదీన దసరా పండుగ రోజున అమల్లోకి రానున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ దిల్లీలో ప్రకటించారు. ఈ ఒప్పందంతో న్యూజిలాండ్‌కు ఎగుమతి చేసే భారతీయ వస్తువులపై వంద శాతం సుంకం వెసులుబాటు లభిస్తుందని, ఇరు దేశాల ఆర్థిక భాగస్వామ్యంలో ఇది కీలక మైలురాయి అని ఆయన స్పష్టం చేశారు.