యువ సినీ సృష్టికర్తలకు ప్రభుత్వం నుంచి పూర్తి అండ: భట్టి విక్రమార్క
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్లోని శిల్పకళావేదికలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో యంగ్ ఫిల్మ్ మేకర్స్ అవార్డుల వేడుక ఘనంగా జరిగిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, నూతన తరం యువ దర్శకులు, నిర్మాతలు మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు. కొత్త ఆలోచనలతో వచ్చే ప్రజ్ఞాశాలులను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ, యువ సినీ సృష్టికర్తలకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసానిచ్చారు.