అనికేపల్లిలో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చిన నాయకులు

రిపోర్టర్: సాయి దివ్య స్థలం: వెంకటాచలం

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లి పంచాయతీలో ఎంపీటీసీ అభ్యర్థులుగా బరిలో నిలిచిన పట్ర సుబ్రహ్మణ్యం మరియు కొర్రగుట విజయకుమార్ ఘన విజయం సాధిస్తారని ప్రదీప్ రెడ్డి మరియు గొట్టం బ్రహ్మయ్య ధీమా వ్యక్తం చేశారు. ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్న వీరిద్దరినీ సైకిల్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఈ ప్రాంతంలో అఖండ విజయం సాధిస్తామని స్థానిక నాయకులు పేర్కొన్నారు.