వరంగల్ లో ఘనంగా పోలీస్ క్రీడా సంబరాలు: ఐజీ గజారావు భూపాల్ ప్రారంభం

రిపోర్టర్: కృష్ణ స్థలం: హన్మకొండ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 5వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026 ఘనంగా ప్రారంభమైందని వరంగల్ పోలీస్ వెల్లడించారు. విధి నిర్వహణలో ఎదురయ్యే మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని ఈ సందర్భంగా ఐజీ గజారావు భూపాల్ పేర్కొన్నారు. క్లస్టర్–డి విభాగంలో నిర్వహిస్తున్న ఈ క్రీడా పోటీలకు ఉమ్మడి జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పోలీసు అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా హాజరయ్యారు.